Header Banner

తిరుపతిలో బాలిక అనుమానాస్పద మృతి! హత్యా? ఆత్మహత్యా? అనేక అనుమానాలు!

  Wed Apr 09, 2025 20:20        Others

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఈనెల 4న 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ సంఘటనను పరువు హత్య కోణంలో పరిశీలిస్తున్నారు. సమాచారం ప్రకారం, బాలిక ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు గతంలోనే యువకుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు పెట్టగా, అతను జైలులో ఉన్నాడు. అయితే బాలిక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పలుమార్లు ఆ యువకుడిని కలిసినట్టు సమాచారం.

 

ఇంటి వారు ఈ విషయం తెలుసుకొని ఆమెను మందలించారని తెలుస్తోంది. అనంతరం బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా బాలిక తల్లిదండ్రులే ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. స్థానిక గ్రామస్థుల సమాచారం ఆధారంగా పోలీసులు స్పందించి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #tirupatigirlcase #honourkilling #suspiciousdeath #justiceforgirl #tirupatiupdates #crimeagainstwomen #scgirlcase #pocsoact